మంగళగిరి గ్యాంగ్ రేప్ ఘటనలో కొత్తకోణం: ప్రియురాలిపై హత్యాచారం చేయించింది ప్రియుడే... మృతురాలి సోదరుడి ఆరోపణ!
- మంగళగిరిలో వెలుగులోకి వచ్చిన దారుణం
- శ్రీనివాసరావు సెల్ ఫోన్ నుంచి స్నేహితులకు ఫోన్లు
- కులాంతర ప్రేమ కోణం దిశగా దర్యాఫ్తు
కాగా, జరిగిన ఘటనపై స్పందించిన జ్యోతి సోదరుడు, తన చెల్లిని శ్రీనివాసరావు తన స్నేహితులతో కలిసి చంపించాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. తన సోదరి శ్రీనివాసరావును ప్రేమించిందని, పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా అడుగుతుంటే కాలయాపన చేస్తూ వచ్చాడని, చివరికిలా దారుణానికి ఒడిగట్టారని ఆరోపించాడు. వారు మాట్లాడుకోవాలంటే, రోడ్డు పక్కనే కూర్చునేవారని, రోడ్డుకు ఇంతదూరం తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. గతంలో తాను శ్రీనివాసరావును హెచ్చరించానని, కొంతకాలం దూరంగా ఉన్న అతను తిరిగి ప్రేమ పేరిట దగ్గరయ్యాడని చెప్పాడు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.