చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చిన జాతీయనేతలు!
- పలువురు నేతల హాజరు
- దీక్షాస్థలికి వచ్చిన రాహుల్, మన్మోహన్, ములాయం, అహ్మద్ పటేల్
- మధ్యాహ్నం తరువాత కేజ్రీవాల్, అఖిలేష్ రాక
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రత్యేక సందేశాన్ని పంపారు. మమత పంపిన సందేశాన్ని ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చదివారు. కొన్ని అత్యవసర కారణాల వల్ల ఆమె రాలేకపోయారని చెప్పారు. కాగా, మధ్యాహ్నం తరువాత కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ తదితరులు ధర్మపోరాట దీక్షకు రానున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం సోనియాగాంధీ సైతం వేదిక వద్దకు వస్తారని తెలిపాయి.