మాదేమన్నా ‘నిప్పు ఫాదర్ ఆఫ్ పప్పు’ తెలివితేటలు అనుకున్నావా చంద్రబాబూ?: కొడాలి నాని ఆగ్రహం
- గుంటూరు సభకు గుడివాడలో పోస్టర్లు
- టీడీపీ నేతలపై వైసీపీ నేత నాని ఫైర్
- ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టీకరణ
కొడాలి నాని ట్విట్టర్ లో స్పందిస్తూ..‘మాకు తెలిసింది స్ట్రెయిట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ మాత్రమే.. మీలా మానిపులేటెడ్ చీప్ ట్రిక్స్ తెలియవు. అక్కడ గుంటూరులో మోడీ సభకు ఇక్కడ గుడివాడలో పోస్టర్స్ వేయించడానికి మాదేమన్నా నిప్పు ఫాదర్ ఆఫ్ పప్పు తెలివితేటలు అనుకున్నవా బాబూ? మాది ఒక్కటే సిద్ధాంతం ఒకటే మాట.. ఒంటరిగా పోటీచేస్తాం’ అని ట్వీట్ చేశారు.