అవినీతి అచ్చు వేసి ఆంబోతు లాంటి కొడుకుని రాష్ట్రం మీద వదిలావు: చంద్రబాబుపై కన్నా ఫైర్
- అవినీతిని ప్రశ్నిస్తే ఎందుకలా ఉలిక్కి పడుతున్నావ్
- కుటుంబ వ్యవస్థ అంటే మీలాగా దోచిపెట్టాలా?
- సన్రైజ్ స్టేట్ చేస్తానని సన్ని మాత్రమే రైజ్ చేశావ్
అవినీతి అచ్చు వేసి ఆంబోతు లాంటి కొడుకుని రాష్ట్రం మీదకు వదిలావంటూ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అవినీతిని ప్రశ్నిస్తే ఎందుకలా ఉలిక్కి పడుతున్నావ్ "స్టికర్ సీఎం"..? బంధాలు, కుటుంబ వ్యవస్థ అంటే మీలాగా దోచిపెట్టాలా? రాష్ట్రాన్ని సన్రైజ్ స్టేట్ చేస్తా అని నమ్మించి నీ సన్ని మాత్రమే రైజ్ చేశావ్.. అవినీతి అచ్చు వేసి ఆంబోతు లాంటి కొడుకుని రాష్ట్రం మీద వదిలావు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.