రేపే ధర్మపోరాట దీక్ష.. మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చంద్రబాబు
- ఏపీ భవన్ ప్రాంగణంలో దీక్ష
- మద్దతు తెలపనున్న విపక్ష నేతలు
- 12న రాష్ట్రపతికి వినతి పత్రం
ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. ఈ నెల 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. దీక్షలో పాల్గొనే ప్రజల కోసం రెండు రైళ్లను ఏపీ ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక రైలు అనంతపురం నుంచి మరో రైలు శ్రీకాకుళం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లాయి.