కుంభమేళాలో భక్తులు స్నానం చేస్తున్న ఫొటోలు తీయకండి!: మీడియాకు అలహాబాద్ హైకోర్టు హెచ్చరిక
- స్నాన ఘట్టాలకు వంద మీటర్ల వరకు ఫొటోగ్రఫీ నిషేధం
- ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
- రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం
భక్తులు స్నానాలు చేస్తున్న ఫొటోలు కానీ, వీడియోలు కానీ తీయరాదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీనిని ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని పేర్కొంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులు, సంస్థలకు తెలియజేయాల్సిందిగా కుంభమేళా ప్రతినిధులను ఆదేశించింది.
కుంభమేళాలో భక్తులు స్నానాలు చేస్తుండగా మీడియా ఫొటోలు తీయకుండా ఆదేశించాల్సిందిగా హైకోర్టు న్యాయవాది అసీం కుమార్ రాయ్ వేసిన రిట్ పిటిషన్ను విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.