ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు.. ఒకేరోజు 4 లక్షల ఇళ్లను ప్రారంభించనున్న చంద్రబాబు!
- నెల్లూరులో ఈరోజు ఇళ్ల పండుగ
- టాప్ ప్లేస్ లో తూర్పుగోదావరి
- షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణం
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో 39,169 గృహాలను, పట్టణ ప్రాంతాల్లో 13,844 ఇళ్లను ఈరోజు లబ్ధిదారులకు అందిస్తారు. ఏపీ అంతటా ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వర కాలనీలో 4,800 ఇళ్లను చంద్రబాబు ఈరోజు ప్రారంభించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఇప్పటికే అమరావతి నుంచి నెల్లూరుకు బయలుదేరారు. ఈ ఇళ్లను అపార్ట్ మెంట్ల తరహాలో షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించారు.