టీడీపీలో ఓ కొలిక్కి వచ్చిన జమ్మలమడుగు వివాదం!

  • ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా
  • సీఎం చంద్రబాబుకు లేఖ సమర్పించిన నేత
  • ఆదినారాయణరెడ్డి కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ  
ఏపీ టీడీపీలో కొనసాగుతున్న జమ్మలమడుగు వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదిరింది. ఆదినారాయణరెడ్డి సోదరులకు తన ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు రామసుబ్బారెడ్డి అంగీకరించారు. అందుకు బదులుగా, రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు అందజేశారు. కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Andhra Pradesh
mlc
rama subba reddy
adi narayana reddy
cuddapah
jammalmadugu

More Telugu News