ఎన్నికలకు ముందు మోదీ చాయ్ వాలా, ఇప్పుడు రాఫెల్ వాలా: మమతా బెనర్జీ ఎద్దేవా
- మోదీ అధికారులందరూ ‘గుడ్ బై’ చెబుతున్నారు
- కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటాం.. వెనుకంజ వేయం
- ధర్నాలో ఆ పోలీస్ అధికారులు పాల్గొనలేదు
మమతా బెనర్జీ ఇటీవల చేపట్టిన ధర్నాలో ఆ రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారులు ఐదుగురు పాల్గొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేంద్రం చర్యలు తీసుకునే ఆలోచనపై ఆమె స్పందించారు. ఆ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. భద్రతాపరమైన అంశాలను చూసేందుకే వారు అక్కడికి వచ్చారే తప్ప, ధర్నాలో పాల్గొనలేదని అన్నారు. ఆ పోలీస్ అధికారులకు ఇచ్చిన పతకాలను కేంద్రం వెనక్కి తీసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత అవార్డులతో వారిని సత్కరిస్తుందని స్పష్టం చేశారు.