టీడీపీ నేతలు కిడారి, సివేరిల హత్య కేసు.. కీలక నిందితుడు ‘డొండురు కిలో’ అరెస్ట్!
- అరెస్ట్ చేసిన ఒడిశా కోరాపుట్ పోలీసులు
- ఎన్ఐఏ అధికారులకు అప్పగింత
- గతేడాది సెప్టెంబర్ 23న నేతల హత్య
ఇతను నందాపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మన్యం ప్రాంతంలో మైనింగ్ ను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను గతేడాది సెప్టెంబర్ 23న కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ కేసును తొలుత విచారించిన ఏపీ పోలీసులు సుబ్బారావు, శోభన్,ఈశ్వరి, కొర్ర కమల అనే మావోయిస్టులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును ఏపీ పోలీసులు ఎన్ఐఏకు బదిలీ చేశారు.