కేఏ పాల్ కు సిలువ వేయబోతున్నానని జీసన్ నాకు ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ పెట్టాడు: రామ్ గోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేఏ పాల్ కు సిలువ వేయబోతున్నానని జీసన్ నాకు ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ పెట్టాడు: రామ్ గోపాల్ వర్మ

  • కేఏ పాల్, వర్మల మధ్య గత కొంత కాలంగా సెటైర్ల యుద్ధం
  • వర్మ నా కాళ్లకు నమస్కరించాడంటూ గతంలో పాల్ వ్యాఖ్య
  • పాల్ ను వెనక్కి పడేలా లాగుదామనుకున్నానంటూ వర్మ కౌంటర్
ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశాడు. తన పేరును ఇంతగా చెడగొడుతున్నందుకు... కేఏ పాల్ కు సిలువ వేయబోతున్నానని ఇప్పుడే జీసస్ క్రైస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడంటూ ట్వీట్ చేశాడు.

గత కొంత కాలంగా వర్మ, కేఏ పాల్ ల మధ్య సెటైర్ ల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మోదీ, చంద్రబాబుల వంటి చిన్న నేతలపై పోటీ చేసేకంటే జీసన్ ను ఓ ప్రపంచాన్ని సృష్టించమని కోరి దానికి కేఏ పాల్ అధ్యక్షుడు అయిపోవచ్చని వర్మ గతంలో ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా ముంబై హోటల్ లో తన పాదాలకు వర్మ నమస్కారం చేశాడంటూ పాల్ వ్యాఖ్యానించాడు.

దీనికి కౌంటర్‌గా ఆర్జీవీ.. ‘ప్రభువా! నేను పాల్ కాళ్లు ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకుని వెనక్కి లాగితే వెనక్కి పడి... తల నేలకు కొట్టుకుని, బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేశా’ అని కామెంట్ పోస్ట్ చేశారు.
ka paul
ram gopal varma
rgv
tollywood
prajashanthi patry

More Telugu News