గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తల్లీకుమారుల మృతి, తండ్రి పరిస్థితి విషమం!
- జిల్లాలోని బుడంపాడు వద్ద ఘటన
- ట్రాక్టర్ దగ్గర నిద్రిస్తుండగా ఢీకొట్టిన మరో వాహనం
- కేసు నమోదుచేసిన పోలీసులు
ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు దుర్గయ్యను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరంతా నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. దుర్గయ్య ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు.