మంత్రి లోకేశ్ కార్యాలయం నుంచి బెదిరింపులు రావటం దారుణం: కన్నా లక్ష్మీనారాయణ
- మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి
- పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నం
- రాష్ట్రానికి ఏం చేశామనేది ప్రధాని వివరిస్తారు
మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా బహిరంగ సభను విజయవంతం చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే డ్రామాలు ఆడటం దురదృష్టమని.. కనీసం ప్రధానికి స్వాగతం పలకలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉండటం సిగ్గు చేటని కన్నా విమర్శించారు. గుంటూరులో జరగబోయే బహిరంగ సభలో దేశానికి, రాష్ట్రానికి ఏం చేశామనేది ప్రధాని తన ప్రసంగంలో వివరిస్తారని కన్నా తెలిపారు.