కేవలం ఐదు నిమిషాలే.. చర్చకు సిద్ధమా?: మోదీకి రాహుల్ గాంధీ సవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేవలం ఐదు నిమిషాలే.. చర్చకు సిద్ధమా?: మోదీకి రాహుల్ గాంధీ సవాల్

  • దేశ భద్రత, రాఫెల్ డీల్ పై చర్చకు సిద్ధమా?
  • 56 అంగుళాల ఛాతీ ఉందని మోదీ చెప్పుకున్నారు
  • మోదీ పిరికివాడనే విషయాన్ని నేను గుర్తించాను
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాటల దాడిని తీవ్రతరం చేస్తున్నారు. ఈరోజు ఆయన మోదీకి మరో సవాల్ విసిరారు. దేశ భద్రత, రాఫెల్ డీల్ పై కేవలం ఐదు నిమిషాల చర్చకు మీరు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. 'మోదీ గారు, మీకు 56 అంగుళాల ఛాతీ ఉందని మీరే చెప్పారు. నాతో ముఖాముఖి చర్చకు రావాలని మీకు సవాల్ విసురుతున్నా' అని రాహుల్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాహుల్ ఈ మేరకు సవాల్ విసిరారు.

ఒకే వేదికపై ఇద్దరం చర్చలో పాల్గొందామని గతంలోనే మోదీకి తాను సవాల్ విసిరానని... కానీ, తన సవాల్ ను స్వీకరించేందుకు ఆయన భయపడుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. మోదీ పిరికివాడనే విషయాన్ని తాను గుర్తించానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రతి పేదవాడికీ కనీస ఆదాయం లభించేలా చేస్తామని తాము హామీ ఇచ్చామని... దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదవారికి కూడా నేరుగా ఈ లబ్ధి అందుతుందని రాహుల్ చెప్పారు.
Rahul Gandhi
modi
congress
bjp
challenge

More Telugu News