నన్ను అంతం చేయడానికి వైసీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి!: బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు
- జీవీఎల్ ఓ పవర్ బ్రోకర్
- దీనిపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేస్తా
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
తనను అంతం చేయడానికి వైసీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అంతకుముందు జీవీఎల్ స్పందిస్తూ.. కాల్ మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారంలో బుద్ధా వెంకన్న సూత్రధారని విమర్శించారు. ఆయనపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశానన్నారు. బుద్ధా వెంకన్న క్షమాపణ చెబితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తానని స్పష్టం చేశారు.