చంద్రబాబుకు అంతా చెప్పాను.. అనుచరులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ!: ఆమంచి కృష్ణమోహన్
- టీడీపీ అధినేతతో 30 నిమిషాలు భేటీ
- పార్టీలో ఇబ్బందిని వివరించిన నేత
- సానుకూలంగా విన్న చంద్రబాబు
అనంతరం మీడియాతో ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. పార్టీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను అధినేత చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. తాను చెప్పిన విషయాలను సీఎం సానుకూలంగా విన్నారన్నారు. తన రాజకీయ భవిష్యత్ పై అనుచరులు, మద్దతుదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను ఒక్కడినే ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేననీ, నాయకుడిగా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక రియాక్ట్ అవుతానని చెప్పారు. టీడీపీలో ఉండాలన్నదే తన అభిమతమన్నారు. అనంతరం అక్కడి నుంచి చీరాలకు బయలుదేరారు.