Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ సేతుపతి హీరోగా 'తుగ్లక్' .. హీరోయిన్ గా సమంత?

  • వరుస హిట్లతో విజయ్ సేతుపతి
  • కొత్త దర్శకుడితో 'తుగ్లక్'
  • సమంత ఓకే చెప్పే ఛాన్స్  
సమంత ఇప్పుడు విభిన్నమైన కథాంశాలకు .. విలక్షణమైన పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఈ కారణంగానే తెలుగులో '96' రీమేక్ లో చేయడానికీ .. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక కొరియన్ మూవీ రీమేక్ లో చేయడానికి ఆమె అంగీకరించింది. అలాంటి సమంత తమిళంలో విజయ్ సేతుపతి జోడీగా 'తుగ్లక్' అనే సినిమా చేయనున్నట్టుగా కోలీవుడ్లో ఒక వార్త షికారు చేస్తోంది.

ఒక కొత్త దర్శకుడు సమంతను కలిసి కథ చెప్పడం .. సమంత పాజిటివ్ గా స్పందించడం జరిగిందట. త్వరలోనే తన నిర్ణయం చెబుతానని సమంత అన్నట్టుగా సమాచారం. కథలోని కొత్తదనం కారణంగా .. విజయ్ సేతుపతికి తమిళనాట గల క్రేజ్ కారణంగా తప్పకుండా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందనే అంటున్నారు. విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకుని '96'తో త్రిష హిట్ కొట్టేసింది. ఇక 'తుగ్లక్' తో సమంత కూడా తన ఖాతాలో హిట్ వేసుకుంటుందేమో చూడాలి.
vijay setupathi
samanta

More Telugu News