వెంకటేశ్ కుమార్తె ఎంగేజ్ మెంట్ లో సమంత ఇలా!

  • వైభవంగా అశ్రిత నిశ్చితార్థం
  • డిజైనర్ శారీలో అదరగొట్టిన సమంత
  • సోషల్ మీడియాలో ఫోటోలు
విక్టరీ వెంకటేశ్ కుమార్తె అశ్రిత నిశ్చితార్థం హైదరాబాద్ లో జరుగగా, ఈ వేడుకకు సమంత హాజరైంది. ఈ సందర్భంగా తాను ఎలా మేకప్ చేసుకుని వెళ్లానన్న విషయాన్ని సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏక్యా బెనారస్ డిజైనర్ శారీలో మెరిసిపోయిన సమంత, కృష్ణ దాస్ జ్యూయెలరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న బంగారు ఆభరణాలను ధరించింది. ఆమెకు సాధనా సింగ్ మేకప్ చేయగా, జుకాల్కర్ హెయిర్ స్టయిల్ చేశారట. నిశ్చితార్థానికి వచ్చిన ఆమె, పలు వెరైటీల్లో ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె తాజా చిత్రం 'సీమరాజా' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే.

Venkatesh
Samanta
Ashrita
Engagement

More Telugu News