బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు: పోలీసుల అదుపులో ప్రియుడు సూర్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు: పోలీసుల అదుపులో ప్రియుడు సూర్య!

  • సూర్యతో చాటింగ్ చేసిన తరువాతే ఆత్మహత్య
  • ఝాన్సీ సెల్ ఫోన్ స్వాధీనం
  • లాక్ ఓపెన్ చేయించేందుకు సైబర్ నిపుణుల సాయం
'పవిత్రబంధం' సీరియల్ లో నటించి పాప్యులర్ అయిన బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య వెనుక ఆమె ప్రియుడు సూర్య అనే యువకుడి ప్రేమయం ఉందని భావిస్తున్న పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సూర్యతో వాట్స్ యాప్ లో ఝాన్సీ చాటింగ్ చేసిందని, వారిద్దరూ కలుసుకున్నారని, ఆపైనే ఆమె ఉరి వేసుకుందని నిర్ధారించిన పోలీసులు, సూర్యను విచారిస్తున్నారు.

ఘటనా స్థలిలో ఝాన్సీ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని లాక్ ను ఓపెన్ చేసేందుకు సైబర్ క్రైమ్ నిపుణుల సహాయం కోరారు. ఝాన్సీ స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ముద్దెనెపల్లి మండలం వాడాలి కాగా, ఆమె కుటుంబీకులకు సమాచారం అందించామని, వారు వచ్చిన తరువాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని తెలిపారు.
Jhansi
Police
Surya
Arrest

More Telugu News