పోలీస్ వాళ్లకు కులం ఉండదు.. మాది ఖాకీ కులం!: జగన్ ఆరోపణలపై ఏపీ డీజీపీ స్పందన
- జగన్ చేసిన ఆరోపణలు మీడియాలో చూశాను
- పోలీస్ వాళ్లకు కులం ఉండదు..మాది ఖాకీ కులం
- మెరిట్ ప్రకారమే పదోన్నతులు ఇచ్చారు
హైకోర్టు ఆదేశాల మేరకు మెరిట్ ప్రకారమే పదోన్నతులు ఇచ్చారని, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం అడిగితే తాను సమాధానమిస్తానని అన్నారు. తాను నిజాయతీగా పని చేస్తున్నానని, అవినీతి నిరోధక శాఖ డీజీగా తన పని తీరేంటో ప్రజలకు తెలుసని ఈ సందర్భంగా ఠాకూర్ గుర్తుచేశారు. కాగా, తనపై దాడి జరిగితే ఎలాంటి విచారణ జరగక ముందే గంట లోపే చంద్రబాబు తరఫున డీజీపీ వకాల్తా పుచ్చుకుని ఆయనకు కొమ్ముకాశారని జగన్ నిన్న ఆరోపించారు.