అడ్వాన్స్ గా కొరటాలకి 2 కోట్లు ఇచ్చిన చరణ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అడ్వాన్స్ గా కొరటాలకి 2 కోట్లు ఇచ్చిన చరణ్?

  • చిరంజీవితో కొరటాల మూవీ
  •  ప్రీ ప్రొడక్షన్ దశలో పనులు
  • పరిశీలనలో హీరోయిన్ల పేర్లు  
చిరంజీవితో భారీ సినిమా చేయడానికి కొరటాల శివ రెడీ అవుతున్నాడు. చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో చిరంజీవి రైతు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొరటాల ఒక్కో సినిమాకి 10 నుంచి 15 కోట్లు పారితోషికంగా తీసుకుంటారని వినికిడి.

దీనిని దృష్టిలో పెట్టుకుని, చిరంజీవి సినిమా కోసం ఆయనకి చరణ్ 2 కోట్లను అడ్వాన్స్ గా ఇచ్చాడట. మిగతా మొత్తం పారితోషికంగా కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని షేర్ లో వాటాగా దక్కనున్నట్టు తెలుస్తోంది. కొరటాల కోరిక మేరకే ఇలా ఫిక్స్ చేయడం జరిగిందని అంటున్నారు. సినిమా ఘన విజయాన్ని సాధిస్తే కొరటాల వాటాగా భారీ మొత్తమే ముడుతుందన్న మాట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం నయనతార .. అనుష్క .. తమన్నా పేర్లను పరిశీలిస్తున్నారు. ఎవరిని ఖరారు చేస్తారో చూడాలి మరి. 
koratala
chiranjeevi

More Telugu News