ప్రధాన పాత్రధారిగా కీర్తి సురేశ్ .. కేరళలో ఏకధాటిగా షూటింగ్
- నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తి సురేశ్
- ఈ నెల 10వ తేదీ నుంచి మొదలు
- తమిళంతో పాటు తెలుగులోను
మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. కథ ప్రకారం ఈ సినిమా కేరళ నేపథ్యంలో కొనసాగుతుందట. అందువలన ఎక్కువభాగం చిత్రీకరణ అక్కడ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏకధాటిగా అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.