లారస్ ల్యాబ్స్ సీఈవో చావా సత్యనారాయణకు ప్రతిష్ఠాత్మక అవార్డు
- మొత్తం 16 మందిని ఎంపిక చేసిన నిపుణుల బృందం
- హైదరాబాద్‌లోని రెండు ఫార్మాస్యూటికల్ కంపెనీల సీఈవోలకు అవార్డు
- అజీం ప్రేమ్‌జీకి లైఫ్ టైమ్ అవార్డు
‘ఈవై ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల ఎంపిక కోసం ఉదయ్ కోటక్ నేతృత్వంలోని ఎనిమిది మంది నిపుణుల బృందం మొత్తం 16 మందిని ఎంపిక చేసింది. వీరిలో ఫ్యూచర్ గ్రూపు వ్యవస్థాపకుడు, సీఈఓ కిశోర్ బియానీ, టైటాన్ కంపెనీ ఎండీ భాస్కర్ భట్, ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈఓ సిద్ధార్ధ లాల్ తదితరులు ఉన్నారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీని లైఫ్‌టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు వరించింది.