మాకు మద్దతు ఇచ్చినందుకు నాగబాబుగారికి ధన్యవాదాలు: యాంకర్ రష్మి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాకు మద్దతు ఇచ్చినందుకు నాగబాబుగారికి ధన్యవాదాలు: యాంకర్ రష్మి

  • ఎవరి వస్త్రధారణ వాళ్ల ఇష్టం 
  • గొప్పతనాన్ని దుస్తుల వైపు నుంచి చూడకండి
  • నాగబాబు సార్ మాకు మద్దతుగా నిలిచారు
ఇటీవల కొంతమంది ప్రముఖులు .. ఆడపిల్లల వస్త్రధారణ గురించి ప్రస్తావించారు. సంప్రదాయ బద్ధమైన వస్త్రధారణ లోపించడం వల్లనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయలను వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా నాగబాబు స్పందిస్తూ ఒక వీడియోను వదిలారు. ఫలానా వస్త్రాలను మాత్రమే ఆడపిల్లలు ధరించాలని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు.

మగవారి వస్త్రధారణ విషయంలో ఆడపిల్లలు ఎప్పుడూ అభ్యంతరాన్ని తెలియజేయలేదనే విషయాన్ని గుర్తుచేశారు. పాత సంప్రదాయాలను పట్టుకుని వేళ్లాడటం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాగబాబు ఇలా మాట్లాడటం పట్ల యాంకర్ రష్మి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. "వేసుకునే దుస్తులకు మించి మనిషిలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి. ఆ గొప్పతనాన్ని వాళ్లు వేసుకునే దుస్తుల వైపు నుంచి చూడకండి. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు నాగబాబు సార్" అంటూ ట్వీట్ చేసింది.
rashmi

More Telugu News