'అక్షర' నాకు మంచి పేరు తెస్తుంది: నందిత శ్వేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అక్షర' నాకు మంచి పేరు తెస్తుంది: నందిత శ్వేత

  • 'అక్షర' అందరికీ నచ్చుతుంది
  • నా కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుంది
  • 'కల్కి'లోను ఒక కథానాయికగా నందిత శ్వేత  
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమాలు చేస్తూ నందిత శ్వేత మంచి పేరు తెచ్చుకుంది. ఆమె తాజా చిత్రంగా 'అక్షర' రూపొందుతోంది. తాజా ఇంటర్వ్యూలో నందిత శ్వేత మాట్లాడుతూ, 'అక్షర' సినిమా గురించి ప్రస్తావించింది. ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లోనే అవకాశాలు వస్తుండటం వలన, ఆ తరహా కథలను తగ్గించాలని అనుకున్నాను.

కానీ దర్శకుడు బి.చిన్నికృష్ణ ఈ పాత్రను నేనే చేయాలని పట్టుబట్టడంతో చేశాను. ఈ సినిమా కంటెంట్ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. తొలిసారిగా పూర్తి కథా భారాన్ని మోస్తూ సినిమా చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. పరిణతి చెందిన 'అక్షర' అనే పాత్ర అన్నివర్గాల వారికి  నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది. ఇక నందిత శ్వేత .. 'కల్కి' సినిమాలో ఒక కథానాయికగా చేస్తోన్న సంగతి తెలిసిందే. 
nandita

More Telugu News