ఇదో కలలా ఉంది.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను: సోనాలి బింద్రే

ప్రముఖ సినీ నటి సోనాలి బింద్రే చాలా కాలం తర్వాత తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న సోనాలి.. న్యూయార్క్‌లో చికిత్స చేయించుకుని ఇటీవలే ముంబయికు తిరిగి వచ్చారు.

నేడు సెట్స్‌లోకి అడుగుపెడుతున్న సందర్భంగా తీసిన ఫోటోను షేర్ చేసిన సోనాలి.. తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నారు. ‘చాలా కాలం తర్వాత సెట్స్‌లోకి అడుగుపెట్టాను. ఇదో కలలా ఉంది. మళ్లీ పనిలోకి అడుగుపెట్టినప్పుడు, కెమెరా ముందు నిలబడినప్పుడు కలిగే ఆ ఫీలింగ్‌ను చెప్పడానికి మాటలు సరిపోవు’ అని సోనాలి పేర్కొన్నారు. అయితే ఆమె ప్రస్తుతం ఏ చిత్రంలో నటిస్తున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Go Back to Shorts
Sonali Bendre
Sets
Social Media
Cancer
Newyork

More Telugu News