ఢిల్లీ వెళ్లిన జగన్.. రేపు ఈసీతో భేటి!

  • అపాయింట్‌మెంట్ ఇచ్చిన కేంద్ర ఎలక్షన్ కమిషన్
  • రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసే అవకాశం
  • ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఫిర్యాదు
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన నేడు ఢిల్లీ వెళ్లారు. రేపు ఉదయం పదకొండున్నర గంటలకు పార్టీ నేతలతో కలిసి జగన్.. ఈసీని కలుస్తారు. ఏపీలో ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలి పైనా ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్న భోజనానంతరం జగన్ హైదరాబాద్ చేరుకుంటారు.
Go Back to Shorts
Jagan
Delhi
Election commission
DGP
Voter list

More Telugu News