ఏపీ హైకోర్టు నిర్మాణం చారిత్రాత్మకం.. న్యాయ సమస్యలు రాకుండా భూసేకరణ చేయడం గొప్ప విషయం: జస్టిస్ ఎన్వీ రమణ
- భూములిచ్చిన రైతులను తరతరాలు గుర్తుంచుకుంటాయి
- న్యాయ వ్యవస్థలో ఎన్నో ఒత్తిడులు ఉంటాయి
- ఒక్క రోజులో ధర్మ స్థాపన జరగదు
జస్టిస్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, హైకోర్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత కనిపించిందని కితాబిచ్చారు. అమరావతికి హైకోర్టు రావడంతో ఏపీ ప్రజలకు న్యాయం మరింత చేరువలో ఉంటుందని తెలిపారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో హైకోర్టు ఉండాలనే ఏపీ ప్రజల కోరిక నెరవేరిందని చెప్పారు. దేశంలోనే ఏపీ హైకోర్టు గొప్పదిగా వెలుగొందాలని ఆకాంక్షించారు.