చంద్రబాబుపై బీజేపీ నేత జీవీఎల్ వివాదాస్పద వ్యాఖ్యలు
- అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలపై సీఎం మండిపాటు
- చంద్రబాబు పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందన్న జీవీఎల్
- అసెంబ్లీ రౌడీలా వ్యవహరిస్తున్నారన్న బీజేపీ ఎంపీ
రెండు రోజుల క్రితం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదన్నారు. అయితే, చంద్రబాబు మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడ్డుపడి ‘అబ్జక్షన్’ అన్నారు. దీంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యేపై సీఎం బాబు మండిపడడంపై జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అసెంబ్లీ రౌడీలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.