బ్రహ్మానందం గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు: నటి హేమ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రహ్మానందం గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు: నటి హేమ

  • బ్రహ్మానందం గారితో మాటలు వున్నాయి
  • నన్ను ప్రోత్సహించింది ఆయనే
  • త్వరలోనే తిరిగొచ్చి ఎప్పటిలా నవ్విస్తారు 
తెలుగు తెరపై సందడి చేసే లేడీ ఆర్టిస్టులలో హేమ పేరు ముందుగా కనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం జోడీగా ఆమె చేసిన అల్లరిని ప్రేక్షకులు మరిచిపోలేరు. అలాంటి బ్రహ్మానందం .. హేమల మధ్య మనస్పర్థలు తలెత్తాయనే టాక్ ఆ మధ్య ఫిల్మ్ నగర్లో వినిపించింది. ఈ కారణంగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో ట్రాకులు ఎవరూ రాయడం లేదంటూ చెప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమకి .. బ్రహ్మానందంతో ఇప్పుడు రిలేషన్ ఎలా వుంది?' అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .." బ్రహ్మానందం గారు .. నేను పోట్లాడుకున్న సమయంలోనే మాట్లాడుకునేవాళ్లం. నేను రాజకీయాల్లోకి వెళ్లడానికి బీజం వేసింది ఆయనే. ఈ విషయంపై మా వారితో మాట్లాడింది ఆయనే. బ్రహ్మానందం గారి అనారోగ్యం విషయం నాకు ఆలస్యంగా తెలిసింది .. ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే వున్నాను. త్వరలోనే ఆయన వచ్చి ఎప్పటిలా మనందరినీ నవ్విస్తారు" అని చెప్పుకొచ్చారు.   
hema

More Telugu News