తమిళ 'అత్తారింటికి దారేది'కి బ్యాడ్ టాక్
- తెలుగులో హిట్ కొట్టిన 'అత్తారింటికి దారేది'
- శింబు హీరోగా తమిళంలో రీమేక్
- నిన్న విడుదల కాగా నెగెటివ్ టాక్
శింబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన కేథరిన్ .. మేఘ ఆకాశ్ మెరిశారు. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ నటించింది. నిన్న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా .. బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాల పరంగా ఈ సినిమా పూర్తిగా నిరాశ పరిచిందని అక్కడి క్రిటిక్స్ రాశారు. శింబు చేసిన ఓవరాక్షన్ వెగటు పుట్టించిందనే మాట సాధారణ జనాల నుంచి వినిపిస్తోంది. మొత్తానికి ఇక్కడ పవన్ ఫ్యాన్స్ ను హుషారెత్తించిన ఈ సినిమా, అక్కడ శింబు అభిమానులు డీలా పడేలా చేసిందన్న మాట.