రానా సినిమాకి ఆర్ధిక ఇబ్బందులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రానా సినిమాకి ఆర్ధిక ఇబ్బందులు!

  • సజావుగా సాగని 'హాథీ మేరీ సాథీ'
  • తమిళ .. తెలుగు భాషల్లో '1945'
  • తెలుగులో వేణు ఊడుగులతో ఒక సినిమా    
'బాహుబలి' సినిమాతో రానా క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి తమిళ .. హిందీ దర్శక నిర్మాతలు కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా బాలీవుడ్ నుంచి వచ్చిన 'హాథీ మేరీ సాథీ' .. 'హౌస్ ఫుల్ 4' సినిమాలు చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు. ఇక తమిళ .. తెలుగు భాషల్లో '1945' నిర్మితమవుతోంది. ఈ మూడు కూడా భారీ ప్రాజెక్టులే.

కొన్ని కారణాల వలన 'హాథీ మేరీ సాథీ' సినిమా షూటింగ్ సజావుగా సాగడం లేదు. ఇక '1945' సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా కూడా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. నిధులను సమకూర్చుకోవడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తేనే మళ్లీ ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రానా జోడీగా రెజీనా నటిస్తోంది. ముఖ్యమైన పాత్రలను నాజర్ .. సత్యరాజ్ పోషిస్తున్నారు. ఇక తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రానా రెడీ అవుతున్నాడు. 
rana

More Telugu News