భానుప్రియ కూడా అరెస్ట్ అవుతుందా?
- భానుప్రియకు కొత్త సమస్య
- 14 ఏళ్ల బాలికతో వెట్టిచాకిరీ
- బాలలను పనిలో పెట్టుకోవడం పెద్ద నేరమే
- రుజువైతే జైలు శిక్ష తప్పదంటున్న పోలీసులు
ఆ బాలిక తమ ఇంట్లో పని చేస్తున్నట్టు భానుప్రియ ఒప్పుకున్నట్టు వీడియోలు ఉండటంతో ఈ కేసులో ఆమె స్వయంగా చిక్కుకున్నట్లయిందని, ఆమె అరెస్ట్ తప్పక పోవచ్చని పోలీసులు అంటున్నారు. మైనర్ బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకోవడం పెద్ద నేరమని, అంతేకాకుండా, ఆమెను లైంగికంగానూ వేధించారని ఆరోపణలు రావడంతో, అవి రుజువైతే భానుప్రియకు, ఆమె సోదరుడికి శిక్ష తప్పదని చెబుతున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, భానుప్రియను, ఆమె కుటుంబీకులను విచారించి, తదుపరి అడుగులు వేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.