Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నానితో మంజుల నిర్మించే సినిమా

  • 'జెర్సీ'తో బిజీగా నాని 
  • నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమార్ తో 
  • త్వరలోనే సెట్స్ పైకి
మొదటి నుంచి కూడా నాని ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. సినిమా విజయవంతమైనా .. పరాజయం పాలైనా తాను అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేస్తుంటాడు .. కొత్త ప్రాజెక్టులు సెట్స్ పైకి వచ్చేలా చేస్తుంటాడు. అలాంటి నాని ప్రస్తుతం 'జెర్సీ' సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి ఆయన రెడీ అవుతున్నాడు.

ఇక ఈ ప్రాజెక్టు తరువాత నానితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా వున్నారు. దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు ఇంద్రగంటి .. నానితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక గీతా ఆర్ట్స్ లో నాని హీరోగా ఒక సినిమా చేయడానికి దర్శకుడు మారుతి రెడీ అవుతున్నాడు. మహేశ్ బాబు సోదరి మంజుల కూడా నానితో ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆమె అడ్వాన్స్ మారుతి దగ్గర వుందట. అందువలన తన ప్రాజెక్టు ముందుగా పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఆమె వుంది. ఈ కాంబినేషన్స్ లో నాని ముందుగా ఎవరితో సెట్స్ పైకి వెళతాడో చూడాలి మరి. 
nani

More Telugu News