విమానంలో యువతి కునుకుతీస్తుంటే... తాకరానిచోట తాకుతూ వేధింపులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానంలో యువతి కునుకుతీస్తుంటే... తాకరానిచోట తాకుతూ వేధింపులు!

  • భోపాల్ నుంచి హైదరాబాద్ కు యువతి
  • నిద్రపోతుంటే వేధింపులు
  • కేసును విచారిస్తున్న పోలీసులు
అలసిపోయిన తాను, విమానంలో కునుకుతీస్తే, పక్కన కూర్చున్న వ్యక్తి తాకరానిచోట తాకుతూ వేధించాడని పీజీ విద్యార్థిని (25) శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బెంగళూరులో చదువుకుంటున్న యువతి, భోపాల్ నుంచి ఎస్జీ - 1267 నంబరుగల స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ బయలుదేరింది. రాత్రి సరిగ్గా నిద్రలేకుండా, తెల్లవారుజామునే వచ్చి, ఉదయం 6 గంటల్లోపే విమానం ఎక్కిన ఆమె, అలసటతో కాస్తంత నిద్రపోగా, పక్కన కూర్చున్న మరో ప్రయాణికుడు వేధింపులకు దిగాడు. వెంటనే లేచిన ఆమె, విమాన సిబ్బందిని అప్రమత్తం చేసి, ఎయిర్ పోర్టులో దిగగానే, పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 354 బీ కింద కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. 
Hyderabad
Flight
Harrasment
Bhopal

More Telugu News