పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబే సొంతంగా చూస్తున్నారు: విష్ణుకుమార్ రాజు
- నోట్ల రద్దుతో పారదర్శకత పెరిగింది
- పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది
- కేంద్రం చొరవతోనే ప్రాజెక్టుల నిర్మాణం
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ, నోట్ల రద్దుతో పారదర్శకత పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య సైతం పెరిగిందన్నారు. రైతు బంధు పథకానికి, కేంద్ర పథకానికి తేడా ఉందని.. రూ.6 వేలు పెట్టుబడి సాయం అనేది సాహసోపేత నిర్ణయమని కేంద్రాన్ని కొనియాడారు. రైల్వే జోన్, స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని.. కేంద్రం చొరవతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు.