Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎఫ్ 2' సత్తాను చాటి చెప్పిన 20 రోజుల వసూళ్లు

  • తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకి పైగా షేర్
  • ప్రపంచవ్యాప్తంగా 74 కోట్లకి పైగా షేర్
  • ఓవర్సీస్ లో 8 కోట్లకి పైగా షేర్  
కథల విషయంలో వెంకటేశ్ ను ఒప్పించడం అంత తేలికైన పనేం కాదు .. ఆయనకి వున్న అనుభవం అలాంటిది. కథ .. అందులో తన పాత్ర విషయంలో పూర్తి క్లారిటీ రానిదే ఆయన సెట్స్ పైకి రారు. అలాంటి వెంకటేశ్ సరైన కథ కోసం వెయిట్ చేస్తూ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ సమయంలోనే అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' కథతో ఆయనను ఒప్పించడం .. అది కాస్తా వెంకటేశ్ నమ్మకాన్ని నిలబెట్టడం జరిగిపోయాయి.

విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకూ వసూళ్ల పరంగా ఈ సినిమా తన జోరును కొనసాగిస్తూనే వుంది. ఈ సినిమా విడుదలైన ఈ 20 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకి పైగా షేర్ ను .. ప్రపంచవ్యాప్తంగా 74 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా ఇంతవరకూ 8 కోట్లకి పైగా వసూళ్లను సాధించడం విశేషం. వెంకీ కెరియర్లో అత్యధిక వసూళ్లను .. లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా 'ఎఫ్ 2' ను గురించి చెప్పుకుంటున్నారు. 
venkatesh
varun

More Telugu News