సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
- పోర్ట్ బ్లెయిర్ కు బస్సీని బదిలీ చేసిన నాగేశ్వరరావు
- జనవరి 21న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బస్సీ
- 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసిన సుప్రీం
ఈ నేపథ్యంలో, తన బదిలీని సవాల్ చేస్తూ జనవరి 21న సుప్రీంకోర్టును బస్సీ ఆశ్రయించారు. ఆస్థానాపై నమోదైన ఎఫ్ఐఆర్ ను విచారిస్తున్న నేపథ్యంలో, తనపై తప్పుడు కేసులు పెట్టడం లేదా డిపార్ట్ మెంట్ విచారణను చేపట్టడం వంటి చర్యల్లో భాగంగా... తనను ఇబ్బంది పెట్టే చర్యల్లో ఇది తొలి అడుగని చెప్పారు. ఆస్థానా కేసు విచారణను ప్రభావితం చేసేలా... తన బదిలీ వెనుక భారీ కుట్ర దాగుందని ఆరోపించారు. కేసును నిష్పక్షపాతంగా విచారిస్తున్న తనను బలిపశువును చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు చేరీ చేసింది.