'118' సినిమాలో హైలైట్ గా నిలిచే అంశం అదేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'118' సినిమాలో హైలైట్ గా నిలిచే అంశం అదేనట!

  • గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ 
  • థ్రిల్లింగ్ అంశాలతో సాగే కథ
  •  త్వరలో ప్రేక్షకుల ముందుకు    
కల్యాణ్ రామ్ ను సక్సెస్ పలకరించి చాలా కాలమే అయింది. దాంతో ఆయన సక్సెస్ ను అందుకోవాలనే పట్టుదలతో, తన తాజా చిత్రానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన తాజా చిత్రం గుహన్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ తన పాత్రకి డబ్బింగ్ చెబుతున్నాడు.

విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో అండర్ వాటర్ లో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారట. వెరైటీగా డిజైన్ చేసిన ఈ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఉత్కంఠ భరితులను చేస్తూ సాగే ఈ యాక్షన్ సీన్ లో పాల్గొనడానికి కల్యాణ్ రామ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడట. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
kalyan ram
niveda
shalini

More Telugu News