ఈసారి రూ.100 నోట్లను కూడా రద్దుచేయండి.. అద్భుతాలు జరుగుతాయ్!: కేంద్రంపై చిదంబరం సెటైర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈసారి రూ.100 నోట్లను కూడా రద్దుచేయండి.. అద్భుతాలు జరుగుతాయ్!: కేంద్రంపై చిదంబరం సెటైర్లు

  • నిరుద్యోగ రేటు 45 గరిష్టానికి చేరుకుంది
  • అలాంటప్పుడు 7 శాతం వృద్ధి ఎలా సాధ్యం
  • కేంద్రంపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన నేత
కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం స్పందించారు. ఓవైపు దేశంలో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంటే, వృద్ధి రేటు 7 శాతానికి పైగా ఎలా నమోదయిందని ప్రశ్నించారు. జీడీపీ అంచనాలను పెంచుతున్న మోదీ సర్కారు, నిరుద్యోగుల సంఖ్యను దాచి పెడుతోందని ఆరోపించారు.

ఈరోజు చిదరంబరం ట్విట్టర్ లో స్పందిస్తూ..‘సగటున 7 శాతం కూడా ఉపాధి లేకుండా ఒక దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ప్రశ్నిస్తున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం.. 45 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగిత ఇప్పుడే నమోదయ్యింది. అలాంటిది ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి సాధిస్తుందంటే మేం ఎలా నమ్మాలి?

పెద్ద నోట్ల రద్దు జరిగిన 2016లో అత్యధిక వృద్ధి రేటు(8.2 శాతం) నమోదయింది. ఈ సారి రూ.100 రూపాయల నోట్లను కూడా రద్దు చేయండి. మరోసారి అద్భుతమైన వృద్ధి రేటు నమోదవుతుంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Congress
BJP
Narendra Modi
chidambaram
budget meeting
note ban

More Telugu News