Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బరువు పెంచుతున్న కథానాయిక
  • ఎల్బీ స్టేడియంలో బాలకృష్ణ షూటింగ్ 
  • 'ఆల్ ఈజ్ వెల్'లో నాగశౌర్య  
*  'ధడక్' చిత్రంతో కథానాయికగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కూతురు జాన్వి తన తదుపరి చిత్రం కోసం బరువు పెరుగుతోంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి వార్ పైలట్ అయిన గుంజన్ సక్సేనా బయోపిక్ గా రూపొందే ఈ చిత్రం కోసం జాన్వి ఏడెనిమిది కిలోల బరువు పెంచుతోందట.
*  బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరుగుతోంది. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన కీలక సన్నివేశాలను, ఎన్టీఆర్ ప్రసంగాన్ని దర్శకుడు క్రిష్ అక్కడ చిత్రీకరిస్తున్నారు.
*  'శ్రీనివాస కల్యాణం' చిత్రం తర్వాత దర్శకుడు సతీష్ వేగేశ్న తన తదుపరి చిత్రం కోసం 'ఆల్ ఈజ్ వెల్' టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నాడు. ఇందులో కథానాయకుడి పాత్ర కోసం నాగశౌర్యను తీసుకుంటున్నారట.  
Sridevi
Jhanvi
Balakrishna
Krish

More Telugu News