Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాశీఖన్నాకు మరో తమిళ చిత్రం 
  • విజయ్ దేవరకొండ వదిలేసిన పాత్రలో జీవా 
  • తెలుగులోకి సమంత తమిళ చిత్రం
*  ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు లేకపోవడంతో తమిళంపై దృష్టి పెట్టిన కథానాయిక రాశీఖన్నాకు అక్కడి నుంచి తాజాగా మరో ఆఫర్ వచ్చింది. విజయ్ సేతుపతి నటించే చిత్రంలో రాశి కథానాయికగా నటిస్తుంది. విజయ్ చందర్ దర్శకత్వంలో ఇది గ్రామీణ నేపథ్యంలో రూపొందుతుంది.
*  విజయ్ దేవరకొండ వదిలేసిన పాత్ర జీవాను వరించింది.1983 క్రికెట్ వరల్డ్ కప్ ను ఇండియా సాధించడం ఇతివృత్తంగా హిందీలో రూపొందుతున్న చిత్రంలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను విజయ్ దేవరకొండకు ఆఫర్ చేశారు. అయితే, విజయ్ దానిని తిరస్కరించడంతో ఇప్పుడా పాత్రకు తమిళ నటుడు జీవాను తీసుకున్నారట.
*  గత ఏడాది సమంత తమిళంలో చేసిన 'సీమరాజా' మంచి హిట్టయింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి అదే పేరుతో అనువదించారు. వచ్చే నెల 8న 'సీమరాజా'ను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.  
Rashi
Vijay Devarakonda
Jeeva
Samantha

More Telugu News