మహేష్‌తో సినిమాపై స్పందించిన కత్రినా

  • మహేష్‌తో నటిస్తున్నానని పుకార్లు 
  • నేను వేరే చిత్రంపై దృష్టి పెట్టలేను
  • ‘భారత్’ తర్వాత ఏ చిత్రానికీ సంతకం చేయలేదు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ భామ కత్రినా కైఫ్‌తో చేస్తున్నారనే వార్తలు బాగా వినిపించాయి. ఈ వార్తలు కత్రినాను చేరడంతో ఆమె దీనిపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నానని చాలా మంది అనుకుంటున్నారని తెలిసిందని, అందుకే ఇలాంటి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నట్టు తెలిపింది. ‘భారత్’ తర్వాత తాను ఏ చిత్రానికీ ఇంకా సంతకం చేయలేదని స్పష్టం చేసింది. రంజాన్ సందర్భంగా ‘భారత్’ను విడుదల చేయాలనుకుంటున్నామని.. కాబట్టి తాను వేరే చిత్రాలపై దృష్టి పెట్టలేనని కత్రినా తెలిపారు.
Go Back to Shorts
Mahesh Babu
Katrina Kaif
Maharshi
Bharath
Vamsi Paidipally

More Telugu News