రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు అఖిలపక్ష సమావేశాలకు పిలుపునిచ్చారు!: విజయసాయిరెడ్డి
- ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఎందుకు పిలవలేదు
- ప్రత్యేకహోదాపై వైసీపీ మాత్రమే పోరాడుతోంది
- టీడీపీ తప్ప ఎవరికైనా మద్దతు ఇస్తాం
ఏపీకి హోదా వద్దు-ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్ష భేటీని నిర్వహించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. టీడీపీ తప్ప హోదా కోసం పోరాడే ప్రతీ ఒక్కరికి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.