'వెంకీమామ'లో ప్రత్యేక పాత్రలో రానా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వెంకీమామ'లో ప్రత్యేక పాత్రలో రానా?

  • దర్శకుడు బాబీ నుంచి 'వెంకీమామ'
  • ఫిబ్రవరి 21 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • దసరా సెలవుల్లో విడుదల    
దర్శకుడు బాబీ తదుపరి చిత్రంగా 'వెంకీమామ' రూపొందుతోంది. వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. సురేశ్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో వెంకటేశ్ సరసన శ్రియ .. చైతూ జోడీగా రకుల్ కనిపించనున్నారు.

ఇక ఒక ప్రత్యేక పాత్రలో రానా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. తన బాబాయ్ వెంకటేశ్ తో కలిసి నటించాలని ఉందనే ఆసక్తిని చాలా రోజులుగా రానా వ్యక్తం చేస్తున్నాడు. అందువల్లనే ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో ఆయన కనిపించేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దసరా సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'ఎఫ్ 2' స్థాయిలో వెంకటేశ్ మరోమారు సందడి చేస్తాడేమో చూడాలి. 
venkatesh
chaitu
raana

More Telugu News