శ్రీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న అజిత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న అజిత్

  • అజిత్ అభిమానించే నటి శ్రీదేవి
  • తమిళ సినిమా ఆయనతో నిర్మించాలనేది శ్రీదేవి కల
  • అజిత్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు        
తమిళనాట అగ్రకథానాయకుడిగా అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి అజిత్ ఎక్కువగా అభిమానించే నటి శ్రీదేవి. ఈ కారణంగానే ఆమె అడగ్గానే 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాలో ఒక రోల్ చేశాడు. అలాంటి అజిత్ ఇప్పుడు శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు .. శ్రీదేవికి ఇచ్చిన మాట కోసమే ఆయన ఈ సినిమా చేస్తున్నాడు.

తాజాగా బోనీకపూర్ మాట్లాడుతూ .. "హిందీలో వచ్చిన 'పింక్' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నాను. విద్యాబాలన్ .. శ్రద్ధా శ్రీనాథ్ లు ముఖ్యమైన పాత్రలను చేస్తున్నారు. తన మాతృభాష తమిళంలో అజిత్ హీరోగా ఒక సినిమాను నిర్మించాలనేది శ్రీదేవి కల. తరచూ ఆమె నాతో ఈ మాట అంటూ ఉండేది. 'ఇంగ్లిష్ వింగ్లిష్' షూటింగ్ సమయంలో ఇదేమాట అజిత్ తో ఆమె అంటే, తప్పకుండా చేస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాకి ఆయన పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అలా శ్రీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు .. ఆమె కలను నిజం చేస్తున్నాడు" అని చెప్పుకొచ్చారు.
ajith
boney kapoor

More Telugu News