ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: సినీ నటి దివ్యవాణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: సినీ నటి దివ్యవాణి

  • మాటలు చెప్పే పార్టీలు చాలా ఉన్నాయి
  • పని చేసే పార్టీ టీడీపీ మాత్రమే
  • చంద్రబాబుకే మళ్లీ పట్టం కట్టాలి
ప్రముఖ సినీ నటి దివ్యవాణి ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలపై దివ్యవాణి స్పందించారు. ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మాటలు చెప్పేందుకు చాలా పార్టీలు ఉన్నాయని... కానీ, పని చేసే ఏకైక పార్టీ టీడీపీనే అని అన్నారు. రాష్ట్రం బాగుండాలంటే మళ్లీ చంద్రబాబుకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 
Chandrababu
divyavani
tollywood
Telugudesam

More Telugu News