Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుంచి మరిన్ని ఫొటోలు... ఎవరో చెప్పాలంటున్న రామ్ గోపాల్ వర్మ!

  • మరో రెండు ఫొటోలు విడుదల చేసిన వర్మ
  • 'వీరంతా లక్ష్మీ పార్వతి కారణంగా అప్ సెట్ అయ్యారు' అని వ్యాఖ్య
  • ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేసిన వర్మ
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కోణం నుంచి ఆయన జీవిత చరిత్రలోని ఓ భాగాన్ని'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ రోజుకో చిత్రాన్ని విడుదల చేస్తున్న ఆయన, నేడు మరో రెండు ఫొటోలను విడుదల చేశారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'లో ఈ క్యారెక్టర్ ఎవరిది? అంటూ ఓ ఫొటోను, నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది... ఇక్కడి వారంతా లక్ష్మీ పార్వతి కారణంగా అప్‌ సెట్ అయినట్టు కనిపిస్తున్నారంటూ మరో ఫొటోను పోస్ట్ చేశారు. ఒక చిత్రంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కొందరు, లక్ష్మీ పార్వతిని ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తుండగా, మరో చిత్రంలో ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఓ పాత్రధారి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది.






Ramgopal Varma
Lakshmi's NTR
Twitter

More Telugu News