Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను .. శ్రీదేవి బురఖాలు వేసుకుని సినిమాలకి వెళ్లేవాళ్లం: సీనియర్ నటి సుభాషిణి

  • శ్రీదేవితో చిన్నప్పటి నుంచే పరిచయం
  • మా స్నేహం బలపడుతూ వచ్చింది
  • ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లే వాళ్లం  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుభాషిణి మాట్లాడుతూ, హీరోయిన్ శ్రీదేవితో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. "చిన్నప్పటి నుంచి నేను .. శ్రీదేవి మంచి స్నేహితులం. చెన్నైలో విజయనిర్మల ఆంటీ ఇంటికి దగ్గరలోనే శ్రీదేవి వాళ్లు వుండేవాళ్లు. నేను ఆంటీ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు శ్రీదేవితో పరిచయం ఏర్పడింది. మా ఇద్దరి మధ్య వయసు తేడా చాలా తక్కువ.

నేను ఆంటీ ఇంటికి వచ్చినప్పుడల్లా శ్రీదేవి ఇంటికి వెళ్లి కబుర్లు చెబుతూ ఉండేదానిని. వయసుతోపాటే మా మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. శ్రీదేవి అప్పటికే పాప్యులర్ అయింది కనుక, సినిమాలకి వెళ్లాలంటే ఇబ్బంది. అందువలన ఎవరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో శ్రీదేవి .. నేను ఇద్దరం బురఖాలు వేసుకుని సినిమాలకి వెళ్లేవాళ్లం. శ్రీదేవి .. నేను ఇద్దరం కలిసే ఈత నేర్చుకున్నాం .. బీచ్ కి కూడా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. ఎక్కడికి వెళ్లినా వాళ్ల అమ్మగారు మాతోనే వచ్చేవారు. శ్రీదేవితో గల అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.
subhashini
ali

More Telugu News