ఉండవల్లి అధ్యక్షతన ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్!
- రాష్ట్రానికి జరిగిన నష్టంపై చర్చిస్తున్న అఖిలపక్షం
- వైసీపీ మినహా మిగతా పార్టీల ప్రతినిధులు హాజరు
- జనసేన తరఫున స్వయంగా వచ్చిన పవన్
సమావేశానికి ముందు నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ, వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు ఇటువంటి సమావేశాలు ఉపయోగపడతాయని, సమావేశానికి హాజరు కావాల్సిన బాధ్యత వైసీపీపై ఉందని అన్నారు. ఆ పార్టీ పారిపోయిందని ఎద్దేవా చేసిన ఆయన, హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ టీడీపీయేనని అన్నారు. విభజన హామీల అమలుపై ప్రభుత్వం చేస్తున్న పోరాటం గురించి ఈ సమావేశంలో తెలియజేస్తామని పేర్కొన్నారు. విభజన తరువాత ఏపీకి పూర్తిగా అన్యాయమే జరిగిందని ఆయన అన్నారు.